పాపం .. ముగ్గురు ముద్దుగుమ్మలకూ కలిసిరాలేదే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాపం .. ముగ్గురు ముద్దుగుమ్మలకూ కలిసిరాలేదే!

Tollywood Industry introduced Three New Heroines
  • 'బుట్టబొమ్మ'తో పరిచయమైన అనిఖ సురేంద్రన్ 
  • 'అమిగోస్'తో అలరించిన ఆషిక రంగనాథ్ 
  • 'శ్రీదేవి శోభన్ బాబు'తో ఎంట్రీ ఇచ్చిన గౌరీ కిషన్ 
  • నిరాశపరిచిన ఫలితాలతో ఆలోచనలో బ్యూటీస్  
తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతూ వస్తున్నారు. అలా ఈ నెలలో ముగ్గురు ముద్దుగుమ్మలు ఇక్కడి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ నెల 4వ తేదీన విడుదలైన 'బుట్టబొమ్మ' సినిమాతో, అనిఖ సురేంద్రన్ తెలుగు తెరకి కథానాయికగా పరిచయమైంది. నటన విషయంలో అనిఖకి వంక బెట్టవలసిన అవసరం లేదు. కానీ కథాకథనాల పరంగా ఈ సినిమా పరాజయం పాలైంది. ఈ నెల 10వ తేదీన వచ్చిన 'అమిగోస్'తో ఆషిక రంగనాథ్ టాలీవుడ్ లో అడుగుపెట్టింది. కల్యాణ్ రామ్ జోడీగా ఈ బ్యూటీ అలరించింది .. ఆకట్టుకుంది. అయితే ఆశించిన స్థాయిని ఈ సినిమా అందుకోలేకపోయింది. ఇక ఈ నెల 18న థియేటర్లకు వచ్చిన 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమాతో, గౌరీ కిషన్ కథానాయికగా పరిచయమైంది. బొద్దుగా .. అక్కడక్కడా చార్మీ పోలికలతో కనిపించింది. ఈ సినిమా టైటిల్ ను బట్టి అక్కడ కంటెంట్ ఏదో ఉంటుందని వెళ్లిన ప్రేక్షకులకు, అందుకు పూర్తి భిన్నమైన కంటెంట్ పలకరించింది. ఈ సినిమా ఏ రకంగాను ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముగ్గురు భామలకు కూడా ఫస్టు సినిమా కలిసిరాలేదు. అయితే కథాకథనాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, గ్లామర్ పరంగా ఎక్కువ మార్కులు కొట్టేసిన ఆషిక రంగనాథ్ తెలుగు తెరపై కుదురుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Advertisement
Anikha Surendran
Ashika Ranganath
Gowry Kishan

More Telugu News