రోడ్డు ప్రమాదంలో సినీ నటి గీతాసింగ్ దత్తత కుమారుడి మృతి
- సోదరుడి కుమారులను పెంచుకుంటున్న గీతాసింగ్
- ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించిన మరో నటి కరాటే కల్యాణి
- గీతా సింగ్‌కు సంతాపం తెలుపుతున్న నెటిజన్లు
ఎవడిగోల వాడిది, కితకితలు వంటి సినిమాల ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గీతా సింగ్ వివాహం చేసుకోలేదు. తన సోదరుడి కుమారులను ఆమె దత్తత తీసుకున్నారు. తాజాగా కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోగా వీరిలో ఆమె పెద్ద కుమారుడు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన నెటిజన్లు, అభిమానులు గీతాసింగ్‌కు సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.