త్వరలోనే హిట్ కొట్టేద్దాం: విజయ్ దేవరకొండ
Add ap7am to your home Screen

త్వరలోనే హిట్ కొట్టేద్దాం: విజయ్ దేవరకొండ

will have a hit soon saya vijay devarakonda
  • కెరీర్ ఆరంభంలో విజయాలతో దూసుకెళ్లిన విజయ్
  • ఇప్పుడు వరుస పరాజయాలతో డీలాపడ్డ వైనం
  • ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించిన విజయ్
లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ సినిమాలో చిన్న పాత్రతో టాలీవుడ్ కు పరిచయం అయిన విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలోనే పెద్ద హీరోగా మారిపోయాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ట్యాక్సీవాలా వంటి హిట్ చిత్రాలతో యూత్ లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే, వరల్డ్ ఫేమస్ లవర్ తో పాటు గతేడాది ఎన్నో అంచనాలతో వచ్చిన లైగర్ డిజాస్టర్స్ గా మారడంతో విజయ్ కాస్త డీలా పడ్డాడు. ఇప్పుడు సమంతతో ఖుషీ సినిమా చేస్తున్న విజయ్.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన చిత్రంలో నటిస్తున్నాడు. 

దీంతో పాటు పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే గౌతమ్ తిన్ననూరి కథను కూడా విజయ్ ఓకే చేశాడు. కొన్నాళ్లుగా అపజయాల్లో ఉన్న విజయ్ త్వరలోనే హిట్ కొడతానని అంటున్నాడు. ట్విట్టర్ వేదికగా విజయ్ అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని మర్చిపోలేని ఒక్క హిట్ ఇవ్వన్నా అని అడిగాడు. దానికి స్పందించిన విజయ్ ‘హిట్ ఒక్కటే పెండింగ్ రా.. త్వరలో కొట్టేద్దాం’ అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.
Advertisement
Tollywood
Vijay Devarakonda
hit
fans

More Telugu News