'శాకుంతలం' రిలీజ్ డేట్ వాయిదా .. అధికారిక ప్రకటన!
- ఈ నెల 17న రిలీజ్ కావలసిన 'శాకుంతలం'
- వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించిన మేకర్స్
- త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ చెబుతామని వెల్లడి
- సమంత జోడీగా పరిచయమవుతున్న దేవ్ మోహన్
ఈ సినిమా నుంచి ఒక పాట తరువాత ఒక పాటను వదులుతూ వెళుతున్నారు. ఈ సినిమాను ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దారనే విషయం ఈ పాటల ద్వారానే అందరికీ అర్థమైపోయింది. ఈ తరహా కథలపై దర్శకుడిగా గుణశేఖర్ కి గల పట్టుకు .. మెలోడీ గీతాలపై మణిశర్మకి గల పట్టుకు ఈ సినిమా ఒక ఉదాహరణగా నిలవడం ఖాయమని అనుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లకు రావడం లేదనీ, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుందనే ఆనందంతో ఉన్న అభిమానులకు నిరాశను కలిగించే వార్తనే ఇది. దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ సినిమా నుంచి, మరో ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందనేది చూడాలి.
.