వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కేజీఎఫ్ నటుడు వశిష్ఠ సింహా-పిల్ల జమీందార్ నటి హరిప్రియ
- కుటుంబ సభ్యుల సమక్షంలో మైసూరులో వివాహం
- వారి పెళ్లి ఫొటోలను షేర్ చేసిన నటుడు ధనంజయ
- గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వశిష్ఠ-హరిప్రియ
హరిప్రియ ‘తకిట తకిట’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె నటించిన ‘పిల్ల జమీందర్’ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే, ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’, ‘ఈ వర్షం సాక్షిగా’, ‘జైసింహా’ వంటి సినిమాల్లో నటించారు. ఇక, ‘నారప్ప’ సినిమాతో తెలుగులో కనిపించిన కన్నడ నటుడు వశిష్ఠ సింహా ఆ తర్వాత ‘నయీం డైరీస్’, ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాల్లో నటించారు. కేజీఎఫ్‌లో ఆయన చేసిన కమల్ పాత్ర మంచి గుర్తింపు తీసుకొచ్చింది.