ఇది శ్రీలీల అందాల మాయాజాలమే..లేటెస్ట్ పిక్స్!

Sreeleela Special
  • గ్లామరస్ బ్యూటీగా శ్రీలీల 
  • 'ధమాకా'తో భారీ హిట్ సొంతం 
  • వరుసగా వచ్చిపడుతున్న ఆఫర్లు
  • పెరుగుతున్న అభిమానుల సంఖ్య
తెలుగు తెరకు ఈ మధ్య కాలంలో పరిచయమైన అందమైన కథానాయికలలో శ్రీలీల ఒకరు. ఈ బెంగళూర్ బ్యూటీ 2019లో కన్నడ సినిమా 'కిస్'తో పరిచయమైంది. ఆ తరువాత రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ, గ్లామర్ పరంగా ఈ బ్యూటీ మంచి మార్కులను కొట్టేసింది. ఇక ఇటీవల వచ్చిన 'ధమాకా' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.ఈ సినిమాతో డాన్సుల పరంగా కూడా మంచిపేరు తెచ్చుకున్న ఈ సుందరి, ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేసే సినిమాలోను .. రామ్-బోయపాటి మూవీలోను.. వక్కంతం వంశీ ప్రాజెక్టులోను అవకాశాలను దక్కించుకుంది. త్రివిక్రమ్ - మహేశ్ బాబు సినిమాలోను అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ భామ పేరే ఎక్కువగా వినిపిస్తోందంటే ఆమె స్పీడును అర్థం చేసుకోవచ్చు. అలాంటి శ్రీలీల నుంచి ఆమె లేటెస్ట్ పిక్స్ వదిలారు. బ్లూ కలర్ శారీలో ఈ సుందరి పడుచు పాలరాతి శిల్పంలా మెరిసిపోతోంది. కోలకళ్లతో కొంటె చూపులను విసురుతోంది. కుర్రాళ్లంతా తమ గుండె గోడలపై ఆమె పోస్టర్స్ ను అంటించేసుకుంటున్నారు. ఇది శ్రీలీల అందాల లీల అనే చెప్పాలి. 

Go Back to Shorts
Sreeleela
Actress
Tollywood

More Telugu News