4 రోజుల్లో 'వీరసింహారెడ్డి' వసూళ్లు ఇవే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

4 రోజుల్లో 'వీరసింహారెడ్డి' వసూళ్లు ఇవే!

Veera Simha Reddy Movie Update
  • ఈ నెల 12న విడుదలైన 'వీరసింహారెడ్డి'
  • 4 రోజుల్లో 104 కోట్లకి పైగా వసూళ్లు 
  • ప్రధానమైన బలంగా నిలిచిన కథాకథనాలు
  • సంగీతం .. కొరియోగ్రఫీ .. ఫొటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణ 
  • వసూళ్ల పరంగా తగ్గని దూకుడు  
బాలకృష్ణ ఇంతవరకూ చేస్తూ వచ్చిన ఫ్యాక్షన్ సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్స్ ను నమోదు చేసినవే ఎక్కువ. అలాగే సంక్రాంతికి విడుదలైన ఆయన సినిమాలలో సక్సెస్ ను సాధించినవే ఎక్కువ. ఆయన తాజా చిత్రమైన 'వీరసింహారెడ్డి'కి ఈ రెండు సెంటిమెంట్లు వర్కౌట్ కావడం విశేషం. 

మైత్రీ బ్యానర్లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన విడుదలైంది. తొలి రోజునే ఈ సినిమా 54 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం విశేషం. నాలుగు రోజుల్లో ఈ సినిమా 104 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. 

బాలకృష్ణ కెరియర్ లోనే తొలిరోజున అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా ఇది నిలిచింది. బాలయ్య ద్విపాత్రాభినయం .. యాక్షన్ .. ఎమోషన్ .. బాణీలు .. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ .. ఫొటోగ్రఫీ .. కొరియోగ్రఫీ .. ఇవన్నీ కుదరటం వల్లనే ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Advertisement
Balakrishna
Sruthi Haasan
Gopichand Malineni
Veerasimha Reddy

More Telugu News