నిర్మాతల డబ్బును వేస్ట్ చేయొద్దు: చిరంజీవి
- వాల్తేరు వీరయ్య కోసం బాధ్యతతో పని చేశానన్న చిరంజీవి
- ఈ విజయం సినీ కార్మికులదని వ్యాఖ్య
- ప్రేక్షకులు చెప్పేది విందామన్న మెగాస్టార్
కష్టం తనది, రవితేజది కాదని... సినిమా బాగా రావాలని పని చేసిన వారిదని చెప్పారు. ఈ విజయం సినీ కార్మికులదని అన్నారు. ఈ సినిమా విజయం ఔత్సాహిక దర్శకులకు ఒక కేస్ స్టడీలా ఉపయోగపడుతుందని చెప్పారు. నిర్మాతల డబ్బును వేస్ట్ చేయవద్దని సూచించారు. ఈరోజు హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.