మన జాతి భవిష్యత్తు మీదే: పవన్ కల్యాణ్
- స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు శుభాకాంక్షలు తెలిపిన పవన్
- నేడు శ్రీకాకుళంలో జనసేన ‘యువశక్తి’ సభలో పాల్గొననున్న జనసేన అధినేత
- 100 మంది యువ ప్రతినిధులు కూర్చునేలా వేదిక ఏర్పాటు
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు యువశక్తి కార్యక్రమం జరుగుతుంది. ఇందులో 100 మంది యువకులు ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ రెండు రాజకీయ తీర్మానాలు చేయనున్నారు. ఇక, ఈ రోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పవన్ కల్యాణ్ యువతకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మన జాతి భవిష్యత్తు మీదే.. జై హింద్!’ అంటూ పవన్ ట్వీట్ చేశారు. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా? అని రాసి ఉన్న పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు.