‘ఆర్ఆర్ఆర్’కు మరో విశిష్ట పురస్కారం.. ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు!
- ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటునాటు’ పాటకు పురస్కారం
- అవార్డు ప్రకటించిన వెంటనే చప్పట్లతో ఆనందాన్ని వ్యక్తం చేసిన టీం
- కాలిఫోర్నియాలో అవార్డుల ప్రదానోత్సవం
కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో బుధవారం రాజమౌళి, ఎన్టీఆర్, కీరవాణి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ‘నాటు నాటు’ పాటకు పురస్కారం ప్రకటించిన వెంటనే వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అందరూ చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్ చేసింది.