మెగాస్టార్ గిఫ్టుగా ఇచ్చిన వాచ్ తో నా టైమ్ మారిపోయింది: దేవిశ్రీ ప్రసాద్

మెగాస్టార్ గిఫ్టుగా ఇచ్చిన వాచ్ తో నా టైమ్ మారిపోయింది: దేవిశ్రీ ప్రసాద్

Devisri Prasad Interview
  • 'వాల్తేరు వీరయ్య'కి సంగీత దర్శకుడిగా ఉన్న దేవిశ్రీ ప్రసాద్
  • ఆ సినిమా ప్రమోషన్స్ లో బాబీతో కలిసి బిజీ 
  • తన స్కూల్ డేస్ గురించి ప్రస్తావించిన దేవిశ్రీ 
  • తనని చూడటానికి మెగాస్టార్ వచ్చారంటూ ఆనందం 
  • ఈ నెల 13వ తేదీన రిలీజ్ అవుతున్న సినిమా  
చిరంజీవి తాజా చిత్రమైన 'వాల్తేరు వీరయ్య' సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో డైరెక్టర్ బాబీ .. దేవిశ్రీప్రసాద్ పాల్గొన్నారు. చిరంజీవితో తనకి గల అనుబంధాన్ని గురించి దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తావించాడు. 

"చిరంజీవిగారి చాలా సినిమాలకు మా ఫాదర్ సత్యమూర్తిగారు రచయితగా పనిచేశారు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. అప్పుడు నా స్కూల్ డేస్ నడుస్తున్నాయి. ఒక రోజున నాకున్న మ్యూజిక్ సెన్స్ గురించి మా నాన్నగారి ద్వారా తెలుసుకున్న చిరంజీవిగారు, నన్ను చూడాలని ముచ్చటపడ్డారు. నన్ను తీసుకుని వస్తానని మా ఫాదర్ అంటే, 'లేదు తనని చూడటానికి నేనే వస్తాను' అంటూ అల్లు అరవింద్ గారితో కలిసి మా ఇంటికి వచ్చారు. 

నేను మ్యూజిక్ ను ప్లే చేస్తూ ఉంటే, ఆయన చాలా సంబరపడిపోయారు. 'నేను సరదాగా చూద్దామని వచ్చాను .. అందువలన గిఫ్ట్ ఏమీ తీసుకురాలేదు .. ఇదిగో నీకు గిఫ్టుగా నా ఫేవరేట్ వాచ్ ఇస్తున్నాను" అంటూ తన చేతికి ఉన్న ఖరీదైన ప్లాటినం వాచ్ ను తీసి నా చేతికి పెట్టారు. నిజం చెప్పాలంటే ఆయన అలా నా చేతికి వాచ్ పెట్టిన దగ్గర నుంచే నా టైమ్ మారిపోయింది" అంటూ చెప్పుకొచ్చాడు.
Advertisement
Chiranjeevi
Devisri Prasad
Bobby
Waltair Veerayya Movie

More Telugu News