Balakrishna: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'

Balakrsihna Veerasimha Reddy completes censor work
షార్ట్స్‌లో చూడండి
నందమూరి బాలకృష్ణ హీరోగా రాయలసీమ నేపథ్యంలో వచ్చిన చిత్రాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. తనకు కలిసొచ్చిన కథావస్తువుతో బాలకృష్ణ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన వీరసింహారెడ్డి ఈ నెల 12న విడుదలవుతోంది. తాజాగా, ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తిచేసుకుంది. వీరసింహారెడ్డికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ కేటాయించింది. 

ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర పోషించింది. తమన్ సంగీతం అందించాడు. ఇటీవల ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో వేడుకగా జరిగింది. 

అటు, వీరసింహారెడ్డి ట్రైలర్ ఆన్ లైన్ లో దూసుకుపోతోంది. బాలకృష్ణ చెప్పిన డైలాగులు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి... సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.
Go Back to Shorts
Balakrishna
Veerasimha Reddy
U/A
Censor
Gopichand Malineni

More Telugu News