'వారసుడు' రిలీజ్ విషయంలో వచ్చేసిన క్లారిటీ!
- విజయ్ హీరోగా రూపొందిన 'వారసుడు'
- ఈ నెల 11న విడుదల కానున్న సినిమా
- రిలీజ్ డేట్ వాయిదా పడిందంటూ ప్రచారం
- అదంతా పుకారేనని తేల్చేసిన మేకర్స్
ఫ్యామిలీ ఎంటర్టయినర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాను, సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 11వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఆ రోజున థియేటర్లకు ఈ సినిమా రాకపోవచ్చనీ .. డబ్బింగ్ పనులు పూర్తికాకపోవడమే అందుకు కారణమనే ప్రచారం జోరందుకుంది.
దాంతో వెంటనే ఈ విషయంపై మేకర్స్ స్పందించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడలేదనీ ... ముందుగా చెప్పిన ప్రకారం 11వ తేదీన థియేటర్లకు వస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో పుకార్లను నమ్మొద్దని చెబుతూ, ఈ ప్రచారానికి తెరదించేశారు. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో, భారీ తారాగణమే సందడి చేయనుంది.