ఏపీ హైకోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్ పై నేడు విచారణ

AP High Court hearing on Raghurama petition
  • హైకోర్టును ఆశ్రయించిన రఘురామ
  • తన నియోజకవర్గానికి వెళ్లాలనుకుంటున్నట్టు వెల్లడి
  • పోలీసులు అరెస్ట్ చేస్తారేమోనంటూ ఆందోళన
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ నేడు ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. తనపై ఉన్న కేసుల వివరాలు ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని రఘురామకృష్ణరాజు తన పిటిషన్ లో కోరారు. రఘురామ తరఫున హైకోర్టులో న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు. 

రాష్ట్రంలో ఇప్పటికే పెండింగ్ లో ఉన్న కేసులతోపాటు, కొత్తగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ల వివరాలు ఇవ్వాలని డీజీపీకి లేఖ రాశామని రఘురామ వెల్లడించారు. కానీ డీజీపీ నుంచి స్పందన రాలేదని తెలిపారు.

సంక్రాంతి సమయంలో తన పార్లమెంటు నియోజకవర్గానికి వెళ్లాలనుకుంటున్నట్టు కోర్టుకు వివరించారు. నియోజకవర్గానికి వస్తే పోలీసులు అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ ను సృష్టించి అరెస్ట్ చేసే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే ఈ అంశంపై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
Raghu Rama Krishna Raju
Petition
AP High Court
YSRCP

More Telugu News