Raviteja: 8 రోజుల్లో 69 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన 'ధమాకా'

  • థియేటర్లలో సందడి చేస్తున్న 'ధమాకా'
  • 8 రోజుల్లో 69 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు 
  • ఈ వీకెండులో 75 కోట్ల మార్క్ ను టచ్ చేసే ఛాన్స్
  • సంక్రాంతి నాటికి 100 కోట్ల వసూళ్లు రాబడుతుందనే అంచనా
Dhamaka movie update

మొత్తానికి రవితేజ ఈ ఏడాది చివరిలో హిట్ కొట్టేశాడు. ఈ ఏడాది ఆరంభంలో చేసిన 'ఖిలాడి' .. మధ్యలో చేసిన 'రామారావు ఆన్ డ్యూటీ' అభిమానులను నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన వచ్చిన 'ధమాకా' మాత్రం తొలి ఆటతోనే హిట్ టాక్ ను సంపాదించుకుంది. 

డే వన్ నుంచి ఈ సినిమా భారీ వసూళ్లతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళుతోంది. తొలిరోజునే ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, 8 రోజులు పూర్తయ్యేనాటికి 69 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. ఈ వీకెండులో ఈ సినిమా 75 కోట్ల మార్కును టచ్ చేయడం ఖాయమని అంటున్నారు. 

సంక్రాంతి ముందువరకూ చెప్పుకోదగిన సినిమాలేవీ లైన్లో కనిపించడం లేదు. అందువలన అప్పటివరకూ 'ధమాకా' జోరు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆ లోగా ఈ సినిమా 100 కోట్ల మార్క్ ను టచ్ చేయవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రవితేజ మాస్ యాక్షన్ .. శ్రీలీల గ్లామర్ .. భీమ్స్  బాణీలు ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయనేది టాక్.

More Telugu News