Poonakalu Loading: వాల్తేరు వీరయ్య నుంచి 'పూనకాలు లోడింగ్' సాంగ్ విడుదల

Poonakalu Loading song from Walatair Veerayya out now
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'వాల్తేరు వీరయ్య' చిత్రం నుంచి పక్కా మాస్ బీట్ తో కూడిన 'పూనకాలు లోడింగ్' పాట లిరికల్ వీడియో వచ్చేసింది. ఈ లిరికల్ వీడియోను చిత్రబృందం యూట్యూబ్ లో విడుదల చేసింది. ఈ పాటలో వందల సంఖ్యలో డ్యాన్సర్లతో చిరంజీవి, రవితేజ హుషారుగా డ్యాన్స్ చేయడం ఫ్యాన్స్ కు కనువిందు చేస్తుంది. 

దేవిశ్రీప్రసాద్ చీర్ హార్న్ ఇన్ స్ట్రుమెంట్ తో ఈ పాటలో తనదైన శైలిలో చమక్కు చేశారు. "డోంట్ స్టాప్ డ్యాన్సింగ్... పూనకాలు లోడింగ్" అంటూ ఈ పాటకు చిరంజీవి, రవితేజ కూడా గొంతు కలిపారు. ర్యాప్ సింగర్ రోల్ రైడా కాన్సెప్ట్ ఆధారంగా ఈ పాటకు లిరిక్స్ సమకూర్చారు. ఈ పాటను రామ్ మిరియాల, రోల్ రైడా ఆలపించారు. 

ఈ భారీ యాక్షన్ ఎంటర్టయినర్ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ నటించింది. ఈ చిత్రంలో రవితేజ, కేథరిన్ ట్రెసా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. వాల్తేరు వీరయ్య చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Go Back to Shorts
Poonakalu Loading
Waltair Veerayya
Chiranjeevi
DSP
Bobby
Tollywood

More Telugu News