Raviteja: శ్రీలీల డాన్స్ అదరగొట్టేసింది: రవితేజ

  • ఘనంగా జరిగిన 'ధమాకా' మాస్ మీట్
  • ఫస్టు క్రెడిట్ భీమ్స్ కి వెళుతుందన్న రవితేజ 
  • అందం .. టాలెంట్ శ్రీలీల సొంతమంటూ కితాబు 
  • అభిమానుల సపోర్టు ఇలాగే ఉండాలని కోరిన రవితేజ
Dhamaka Mass Meet

రవితేజ సినిమాల్లో మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. అన్నీ సమపాళ్లలో కుదిరిన ఆయన సినిమాలు అంచనాలను అందుకుంటూ ఉంటాయి. అలాంటి సినిమాల జాబితాలో తాజాగా 'ధమాకా' కూడా వచ్చి చేరింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో, 'మాస్ మీట్' పేరుతో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాఘవేంద్రరావు .. హరీశ్ శంకర్ .. బండ్ల గణేశ్ హాజరయ్యారు.

ఈ ఫంక్షన్ లో రవితేజ మాట్లాడుతూ .. "ఈ సినిమాకి సంబంధించి ముందుగా నా టెక్నీషియన్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కార్తీక్ ఘట్టమనేని ఫొటోగ్రఫీ వలన ఈ సినిమా తెరపై ఇంత కలర్ఫుల్ గా కనిపించింది. మేము కూడా చాలా అందంగా కనిపించాము. ఈ సినిమా సక్సెస్ కి మొదటి కారణం భీమ్స్ అందించిన సాంగ్స్. తను ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాడు. 

ఇక రెండో కారణంగా నిర్మాతలు .. వాళ్ల అంకితభావాన్ని గురించి చెప్పుకోవాలి. ఈ బ్యానర్లో మళ్లీ మళ్లీ పనిచేయాలనిపిస్తోంది. మరో కారణంగా బెజవాడ ప్రసన్న కుమార్ పేరు చెప్పాలి. ఈ సినిమాలో మీరంతా ఎంజాయ్ చేస్తున్న డైలాగ్స్ ఆయన రాసినవే. ఇక శ్రీలీల టాలెంట్ .. గ్లామర్ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. తను డాన్స్ కూడా చాలా బాగా చేసింది. ఇక ఈ బస్ కి డ్రైవర్ త్రినాథరావు అయితే నేను కండక్టర్. మీ అందరి సపోర్టు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ ముగించాడు..

More Telugu News