Raviteja: ఎంత మాత్రం తగ్గని 'ధమాకా' జోరు .. 5 రోజుల వసూళ్లు ఇవే!

  • ఈ నెల 23న విడుదలైన 'ధమాకా' 
  • తొలిరోజునే వచ్చిన హిట్ టాక్  
  • రోజుకి 10 కోట్ల చొప్పున రాబడుతున్న సినిమా
  • ఈ వారం కూడా తగ్గని వసూళ్ల జోరు  
Dhamaka Movie Update

రవితేజ - నక్కిన త్రినాథరావు కాంబినేషన్లో 'ధమాకా' సినిమా తెరకెక్కింది. ఈ నెల 23వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలిరోజునే జిత్ టాక్ ను సొంతం చేసుకుంది. తొలి రోజునే 10 కోట్లకి పైగా గ్రాస్ ను చూసిన ఈ సినిమా, రెండో రోజున 20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇలా రోజుకి 10 కోట్ల చొప్పున వసూళ్లను రాబడుతూ 5 వ రోజుకి 49 కోట్లను రాబట్టి, 50 కోట్ల మార్కును టచ్ చేయడానికి రెడీగా ఉంది. 

రవితేజ ఈ ఏడాది రెండు ఫ్లాపులను మూటగట్టుకున్నాడు. ఆయన అభిమానుల ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారు. పూర్తి మాస్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా, తొలి ఆటతోనే ఆడియన్స్ కనెక్ట్ అయింది. రవితేజ సినిమా నుంచి మాస్ ఆడియన్స్ ఆశించే అంశాలన్నీ పుష్కలంగా ఉండటమే ఈ సినిమా ఈ స్థాయి హిట్ కొట్టడానికి కారణం అనుకోవాలి. ఇక శ్రీలీల గ్లామర్ కూడా కొంత కలిసొచ్చింది. 

ఈ వారంలో కూడా థియేటర్లలో దిగిపోవడానికి చెప్పుకోదగిన సినిమాలేం లేవు. ఈ సినిమాతో పాటు '18 పేజెస్' సినిమా బరిలోకి దిగినప్పటికీ, అది ఒక క్లాస్ లవ్ స్టోరీగా మార్కులు కొట్టేసింది. ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే ఆ సినిమాకి పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులపాటు 'ధమాకా' జోరు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి.

More Telugu News