ప్రపంచవ్యాప్తంగా 'ధమాకా' ఫస్టు డే వసూళ్లు ఇవే!
- నిన్ననే థియేటర్లకు వచ్చిన 'ధమాకా'
- మాస్ కంటెంట్ పుష్కలంగా ఉన్న సినిమా
- హైలైట్ గా నిలిచిన పాటలు .. ఫైట్లు
- తొలిరోజున 10 కోట్లకి పైగా వసూళ్లు
నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా, నిన్ననే థియేటర్లకు వచ్చింది. అక్కడక్కడా కొన్ని సీన్స్ ను పక్కన పెట్టేసి చూస్తే, రవితేజ తన నుంచి తన ఫ్యాన్స్ ఆశించే సందడి చేశాడు. ముఖ్యంగా రామ్ లక్ష్మణ్ ఫైట్స్ .. భీమ్స్ మాస్ బీట్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.
ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున ఈ సినిమా 10 కోట్లకి పైగా రాబట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఈ శని .. ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. దగ్గరలో పోటీ ఇచ్చే పెద్ద సినిమాలేం లేకపోవడం 'ధమాకా'కి మరింత కలిసొచ్చే అంశమనే చెప్పుకోవాలి.