Raviteja: ఈ ఏడాదిలో రవితేజకి ఉన్న ఛాన్స్ ఇదొక్కటే!

  • ఈ ఏడాదిలో రెండు ఫ్లాపులతో ఉన్న రవితేజ 
  • ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'ధమాకా'
  • ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న శ్రీలీల గ్లామర్ 
  • ఈ నెల 23వ తేదీన విడుదలవుతున్న సినిమా

Dhamaka movie update

ఏడాదికి తన నుంచి మూడు సినిమాలైనా థియేటర్లకు వెళ్లాలనే ఉద్దేశంతో రవితేజ కనిపిస్తాడు. దాదాపు ఈ విషయంలో తన ప్లానింగ్ తప్పకుండా చూసుకుంటాడు. ఈ విషయంలో ఈ ఏడాదిలో ఆయన సక్సెస్ అయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలోనే రవితేజ నుంచి 'ఖిలాడి' వచ్చింది. రమేశ్ వర్మ రూపొందించిన ఈ సినిమాలో మాస్ కంటెంట్ చూసి, తప్పకుండా హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. 

ఇక ఏడాది మధ్యలో 'రామారావు ఆన్ డ్యూటీ' వచ్చింది. టైటిల్ తోనే ఈ సినిమా ఆసక్తిని రేకెత్తించింది. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా రవితేజ అభిమానులను నిరాశ పరిచింది. ఇది రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథనే .. ఆయనకి సెట్ అయ్యే పాత్రనే. అయితే కొన్ని కారణాల వలన ఇది అభిమానులను సంతృప్తి పరచలేకపోయింది. 

ఈ నేపథ్యంలోనే ఈ ఏడాదిలో రవితేజ నుంచి మూడో సినిమాగా 'ధమాకా' వస్తోంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రినాథరావుకి మాస్ కంటెంట్ పై ఉన్న పట్టు .. రవితేజ మార్కు కామెడీ .. శ్రీలీల గ్లామర్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ అంటున్నారు. ఈ ఏడాదిలో రవితేజ హిట్ అనే మాట వినడానికి ఉన్న ఛాన్స్ ఈ సినిమా ఒక్కటే. ఆయన ఫ్లాపులకు ఈ సినిమా అడ్డుకట్ట వేస్తుందేమో చూడాలి.

More Telugu News