Srihan: నాతో సిరి చెప్పింది అదే .. అప్పటి నుంచి మారిపోయాను: శ్రీహాన్

Srihan Interview
షార్ట్స్‌లో చూడండి
బిగ్ బాస్ హౌస్ లో శ్రీహాన్ .. రేవంత్ .. శ్రీసత్య మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారు. సమయానికి తగినట్టుగా వీరు కలిసి ఆడుతున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. రేవంత్ విషయాన్ని అలా ఉంచితే శ్రీహాన్ - శ్రీసత్య కాస్త ఎక్కువ చనువుగా ఉండేవారు. అయితే ఫ్యామిలీ వీక్ లో బిగ్ బాస్ హౌస్ లోకి 'సిరి' వచ్చి వెళ్లింది. అప్పటి నుంచి శ్రీహాన్ లో మార్పు వచ్చిందనే టాక్ బలంగా వినిపించింది. 

శ్రీహాన్ లో వచ్చిన ఈ మార్పు గురించి అతను లేని సమయంలో రేవంత్ - శ్రీసత్య మాట్లాడుకున్నారు కూడా. సిరి ఏదో చెప్పడం వల్లనే అతను శ్రీసత్య - రేవంత్ లను దూరం పెడుతున్నాడని అంతా అనుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో శ్రీహాన్ కి ఇదే ప్రశ్న ఎదురైంది. అందుకు అతను తనదైన స్టైల్లో స్పందించాడు. 

"ఫ్యామిలీ వీక్ లో సిరి హౌస్ లోకి వచ్చినప్పుడు నా నుంచి ఎంటర్టైన్మెంట్ తగ్గింది అని చెప్పింది. నేను కాస్త ఎక్కువగా వెటకారం చేస్తున్నానని అంది. ఎవరి సపోర్టును తీసుకోకుండా .. టాస్కులో ఫ్రెండ్షిప్ అనేది చూడకుండా ఆడమని చెప్పింది. అప్పటి నుంచి ఆ పొరపాట్లను సరిచేసుకుంటూ వచ్చాను. అంతే తప్ప ఫ్రెండ్స్ ను దూరం పెట్టలేదు" అంటూ చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Srihan
Revanth
Sri Sathya
Bigg Boss

More Telugu News