మాస్ బీట్ తో 10 మిలియన్ ప్లస్ వ్యూస్ రాబట్టిన 'వీరసింహా రెడ్డి'

Veera Simha Reddy Movie Update
బాలకృష్ణ కథానాయకుడిగా 'వీరసింహారెడ్డి' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. బాలకృష్ణ సరసన నాయికగా శ్రుతి హాసన్ నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. 

రీసెంట్ గా ఈ సినిమా నుంచి 'సుగుణ సుందరి' అనే పాటను వదిలారు. 'సీమా కుట్టిందే .. సిట్టి సీమా కుట్టిందే' అనే పల్లవితో ఈ పాట మొదలవుతుంది. ఇలా వదలగానే అలా ఈ పాట ట్రెండింగ్ లో నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకుంది. ఇంతవరకూ 10 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టింది. అందుకు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ వదిలారు. 

రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఎవరు హీరోగా చేసినా, బాలయ్య వేసిన మార్కు చెదిరిపోనిది. ఆ జోనర్లో బాలయ్య చేసిన సినిమాలు దాదాపుగా కొత్త రికార్డులను నమోదు చేశాయి. ఇప్పుడు అదే జోనర్లో ఈ సినిమా నిర్మితమైంది. జనవరి 12వ తేదీన వస్తున్న ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలబడుతుందని తమన్ చెప్పడం విశేషం.
Go Back to Shorts
Balakrishna
Sruthi Haasan
Gopichand Malineni
Veerasimha Reddy Movie

More Telugu News