రవితేజ మామూలోడు కాడు: 'ధమాకా' ఈవెంటులో రాఘవేంద్రరావు

Dhamaka Pre Release Event
షార్ట్స్‌లో చూడండి
రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు 'ధమాకా' సినిమాను రూపొందించాడు. విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాలో రవితేజ సరసన నాయికగా శ్రీలీల నటించింది. ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. 

ఈ స్టేజ్ పై రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. "రవితేజ మామూలోడు కాదు. నేను 'అల్లరి ప్రియుడు' సినిమా తీసినప్పుడు అందులో ఆర్కెస్ట్రా గ్రూపులో చిన్నపాత్ర వేశాడు. అతను డ్రమ్ములు వాయించడం చూసే, ఏదో ఒక రోజున ఇండస్ట్రీని వాయించేస్తాడని అప్పుడే చెప్పాను. శ్రీలీల విషయానికొస్తే, 'పెళ్లి సందD' సినిమాతో ఆంధ్రదేశంలోని మగాళ్లందరి కలల్లోకి వెళ్లిపోయింది" అన్నారు. 

"నా సినిమా తరువాతనే ఈ ఇద్దరూ స్టార్స్ కావడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ ఇద్దరి కలయికలో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. మాస్ సినిమాలను ఎలా హ్యాండిల్ చేయాలనేది త్రినాథరావుకి తెలుసు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Raviteja
Sreeleela
Dhamaka Movie

More Telugu News