మాచర్ల హింస వెనుక చంద్రబాబు, లోకేశ్ ఉన్నారు: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి
- ఫ్యాక్షన్ నాయకుడిని మాచర్లకు పంపి దాడులు చేయిస్తున్నారన్న పిన్నెల్లి
- జూలకంటి వచ్చిన తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయని ఆరోపణ
- గొడవలతో రాజకీయ లబ్దిని పొందాలనుకుంటున్నారని మండిపాటు
బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత మాచర్లలో ఉద్రిక్తతలు పెరిగాయని చెప్పారు. గొడవలు సృష్టించి రాజకీయ లబ్దిని పొందాలనుకుంటున్నారని విమర్శించారు. పార్టీ కార్యక్రమాన్ని ప్రశాంతంగా చేయాలనుకున్నవారు కర్రలు, రాడ్ లతో దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.