Sundeep Kishan: రెజీనా కసాండ్రతో సందీప్ కిషన్ ప్రేమాయణం?

  • సందీప్, రెజీనా ప్రేమలో ఉన్నారంటూ గతంలోనే వార్తలు
  • ఆ వార్తలకు బలాన్ని చేకూర్చిన సందీప్ ట్వీట్
  • సన్నిహితంగా ఉన్న ఫొటోను షేర్ చేసిన సందీప్
Sundeep Kishan and Regina Cassandra in love

టాలీవుడ్ లో మరో ప్రేమాయణం నడుస్తోందనే వార్త వైరల్ అవుతోంది. సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి వీరి ప్రేమకు సంబంధించిన వార్తలు గతంలోనే వచ్చాయి. ఇప్పుడు తాజాగా సందీప్ కిషన్ చేసిన ట్వీట్ ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. 

రెజీనా పుట్టిన రోజు సందర్భంగా సందీప్ ఈ ట్వీట్ చేశాడు. 'హ్యాపీ బర్త్ డే పాప. లవ్యూ. అన్ని విషయాలలో నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. స్టే బ్లెస్డ్' అని సందీప్ ట్వీట్ చేశాడు. అంతేకాదు, ఆమెతో చాలా సన్నిహితంగా ఉన్న ఓ సెల్ఫీ ఫొటోను కూడా షేర్ చేశాడు. దీంతో, వీరి ప్రేమ వ్యవహారం నిజమే అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. వీరిద్దరూ కలిసి 'రారా క్రిష్టయ్య', 'నక్షత్రం' చిత్రాల్లో నటించారు.

More Telugu News