Sri Sathya: ప్రతి ఇంట్లో ఒక కూతురు ఉండాలి: శ్రీసత్య తండ్రి

Sri Sathya Father Interview
షార్ట్స్‌లో చూడండి
బిగ్ బాస్ హౌస్ లో అటు గ్లామర్ పరంగాను .. ఇటు ఆటతీరు పరంగాను శ్రీ సత్య అందరినీ ఆకట్టుకుంది. ఫ్యామిలీ వీక్ లో ఆమె పేరెంట్స్ బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పుడు, టీవీల ముందు కూర్చున్న వాళ్లంతా కన్నీళ్లు పెట్టారు. తాజా ఇంటర్వ్యూలో శ్రీ సత్య తండ్రి మాట్లాడుతూ .. "శ్రీ సత్య చాలా బాగా ఆడుతోంది. టాప్ 5 కి చేరుకుని .. అక్కడి నుంచి విన్నర్ గా నిలవడానికి ఆమె అభిమానులు సపోర్టు చేస్తారని భావిస్తున్నాను" అన్నారు. 

మూడెళ్ల క్రితం తాను ఒక వ్యక్తిని లవ్ చేస్తున్నట్టుగా శ్రీసత్య చెప్పింది. ఆ అబ్బాయిని పిలిపించి మాట్లాడాను. పెళ్లికి రెండు కుటుంబాల వాళ్లం అంగీకరించాము. ఆ అబ్బాయితో శ్రీసత్య ఎంగేజ్ మెంట్ కూడా  జరిగింది. ఆ తరువాత కొన్ని కారణాల వలన ఆ సంబంధాన్ని కేన్సిల్ చేసుకున్నాము. ఆ బాధతో శ్రీ సత్య ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసింది" అన్నారు. 

శ్రీసత్య అలా చేయడం చూసిన ఆమె తల్లికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అందువలన ఆమె కాళ్లు పనిచేయడం మానేశాయి. ఆమె ట్రీట్మెంట్ కోసం ఆస్తులు అమ్మేయవలసి వచ్చింది. అప్పటి నుంచి తల్లి ట్రీట్మెంట్ కోసం శ్రీ సత్య కష్టపడుతూనే ఉంది. ప్రతి ఇంట్లోను ఒక కూతురు ఉండాలి. కన్నవాళ్ల కోసం రెండు కన్నీటి బొట్లు రాల్చేది ఆడపిల్లనే" అంటూ చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Sri Sathya
Revanth
Srihan
Bigg Boss

More Telugu News