Advertisement

కవితపై నుంచి దృష్టి మరల్చేందుకు కేసీఆర్ వైసీపీ నేతలతో కలిసి కుట్ర చేస్తున్నారు: బండి సంజయ్

Bandi Sanjay reacts to Sajjala remarks
  • ఉమ్మడి ఏపీకే తమ ఓటు అన్న సజ్జల
  • రెండు రాష్ట్రాల సీఎంలు డ్రామాలు ఆడుతున్నారన్న సంజయ్ 
  • తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నమని ఆరోపణ
రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని, ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నే కోరుకుంటామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. సజ్జల వ్యాఖ్యల వెనుక కేసీఆర్ ప్రయోజనాలు దాగి ఉన్నాయని తెలిపారు.

జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కుమార్తె కవిత రూ. లక్ష కోట్ల లిక్కర్ దందా చేశారని, కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ వైసీపీ నేతలతో కలిసి కుట్రలు చేస్తున్నాడని బండి సంజయ్ ఆరోపించారు. 

రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. వారిద్దరూ కలిసే ఉన్నారని, కమీషన్లు పంచుకుంటారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఏపీ సీఎంతో మాట్లాడి వైసీపీ నాయకుడితో ఈ వ్యాఖ్యలు చేయించారని వివరించారు. సజ్జల వ్యాఖ్యలతో తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ రగిల్చేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
Advertisement
Bandi Sanjay
Sajjala Ramakrishna Reddy
KCR
K Kavitha
Jagan
BJP
TRS
YSRCP
Telangana
Andhra Pradesh

More Telugu News