Raviteja: రవితేజ జోడీగా శ్రీలీలను సెట్ చేయడం కరెక్టే: 'ధమాకా' డైరెక్టర్

  • మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ గా 'ధమాకా' 
  • రవితేజ సరసన నాయికగా శ్రీలీల 
  • తను మంచి డాన్సర్ అని చెప్పిన త్రినాథరావు 
  • ఫస్టు టైమ్ డబ్బింగ్ కూడా చెప్పేసిందని వెల్లడి
  • ఈ నెల 23వ తేదీన సినిమా రిలీజ్  
Nakkkina Trinatha Rao Interview

యూత్ తో పాటు మాస్ ఆడియన్స్ ను హుషారెత్తించే దర్శకుడిగా నక్కిన త్రినాథరావుకి మంచి పేరు ఉంది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ధమాకా' రెడీ అవుతోంది. రవితేజ జోడీగా ఈ సినిమాలో శ్రీలీల సందడి చేయనుంది. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. 

శ్రీలీల టీనేజ్ అమ్మాయి .. శ్రీకాంత్ తనయుడి జోడీగా 'పెళ్లి సందడి' సినిమా చేసింది. ఆమె ఫస్టు మూవీ అదే. అంత చిన్న అమ్మాయిని రవితేజ వంటి సీనియర్ హీరో జోడీగా సెలెక్ట్ చేస్తే, ఏజ్ గ్యాప్ తెలుస్తుందిగా? పైగా అంత ఏజ్ గ్యాప్ ఉన్నవారితో ఈ మధ్య కాలంలో హీరోలు చేయడం లేదుగా? అనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో నక్కిన త్రినాథరావుకి ఎదురైంది.

అందుకు త్రినాథరావు స్పందిస్తూ .. "రవితేజ జోడీగా ఆమెను చూస్తున్నప్పుడు అలాంటి ఆలోచన మాకు రాలేదు. ఒక టీనేజ్ లవ్ స్టోరీ చేసిన అమ్మాయి ఒక్కసారిగా సీనియర్ హీరో జోడీగా వచ్చేసినప్పుడు అలా అనిపించి ఉండొచ్చు. పోస్టర్స్ లో కూడా మీకు ఆ తేడా తెలియదు. కథ ప్రకారం రవితేజకి తగిన అమ్మాయి అనుకుంటారు అంతే. శ్రీలీల విషయానికొస్తే తను మంచి డాన్సర్ .. ఈ సినిమాలో తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకుంది" అని అన్నాడు..

More Telugu News