బాలయ్య 108వ సినిమాను పట్టాలెక్కించిన అనిల్ రావిపూడి!

Balakrishna 108 movie launched
  • అల్లు అరవింద్ క్లాప్ తో మొదలైన షూటింగ్ 
  • కెమెరా స్విచ్ఛాన్ చేసిన దిల్ రాజు 
  • గౌరవ దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు
బాలకృష్ణ 108వ సినిమా కొంతసేపటి క్రితమే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుని పట్టాలెక్కింది. సాహు గారపాటి - హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు రాఘవేంద్రరావు .. అల్లు అరవింద్ .. దిల్ రాజు హాజరయ్యారు.అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా .. దిల్ రాజు కెమెరా స్విచ్ఛాన్ చేయగా .. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. రెగ్యులర్ షూటింగు కూడా వెంటనే మొదలుకానుంది. బాలయ్య 100వ సినిమా చేయాలని అప్పట్లో అనిల్ రావిపూడి గట్టిగానే ప్రయత్నించాడు. బాలయ్య 108వ సినిమాతో ఆయన కోరిక నెరవేరింది.ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల కనిపించనుంది. హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ పేరు వినిపిస్తోంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ కథలో తన మార్కు కామెడీ తక్కువగా ఉంటుందనీ, బాలయ్య మార్కు యాక్షన్ ఎక్కువగా ఉంటుందని అనిల్ రావిపూడి ముందుగానే చెప్పాడు. ఇక బాలయ్య 107వ సినిమాగా రూపొందిన 'వీరసింహారెడ్డి' సంక్రాంతికి విడుదల కానుంది.
Go Back to Shorts
Balakrishna
Sreeleela
Anil ravipudi

More Telugu News