Balakrishna: బాలకృష్ణ 108వ సినిమాకి రేపే ముహూర్తం!

Balakrishna and Anil Ravipudi Movie Will Launch Tomorrow
షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ 'వీరసింహా రెడ్డి' సినిమా చేస్తున్నారు. కెరియర్ పరంగా ఇది ఆయనకి 107వ సినిమా. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో నడిచే ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల దిశగా అడుగులు వేస్తుండగానే, 108వ సినిమాను బాలయ్య పట్టాలెక్కించే పనిలో పడ్డారు.

సాహు గారపాటి .. హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకి, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నాడు. కొంతకాలంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కసరత్తు జరుగుతూ వస్తోంది. మొత్తానికి ఈ సినిమా షూటింగు లాంచ్ కి ముహూర్తాన్ని ఖాయం చేసినట్టుగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

హైదరాబాదులో రేపు ఉదయం 9:36 నిమిషాలకు ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల చేయనుండగా, ఆయన సరసన నాయికగా ప్రియాంక జవాల్కర్ పేరు వినిపిస్తోంది. రేపు మిగతా వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది.
Go Back to Shorts
Balakrishna
Sreeleela
Priyanka Jawalkar
Anil Ravipudi

More Telugu News