napping: మధ్యాహ్నం చిన్న కునుకు తీస్తే.. వచ్చే ఫలితాలు ఇవిగో!

Is it healthy to take a nap in the afternoon
షార్ట్స్‌లో చూడండి
మధ్యాహ్నం భోజనం తర్వాత కొద్ది సేపు కునుకు (న్యాప్) తీయడం కొద్ది మందికి అలవాటు. ఈ కొద్ది సమయం పాటు కునుకుతో వచ్చే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని పలు అధ్యయనాలు నిర్ధారించాయి. కాకపోతే మధ్యాహ్నం ఎక్కువ సమయం పాటు నిద్రపోవడం మంచిది కూడా కాదు. అసలు మధ్యాహ్నం కునుకుతో వచ్చే ప్రయోజనాలు ఏంటన్నది చూద్దాం.

ప్రయోజనాలే ఎక్కువ
  • కునుకు తీయడం కేవలం శిశువులు, చిన్న పిల్లలకే కాదు, పెద్దలకు కూడా మంచిది.
  • నిద్ర అన్నది జ్ఞాపకాలు పదిల పరుచుకోవడానికి ఉపయోగపడే మంచి సమయం. మధ్యాహ్నం నిద్రతో ఉదయం నుంచి తెలుసుకున్న అంశాలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని పలు అధ్యయనాలు గుర్తించాయి. 
  • అంతేకాదు క్లిష్ట సమస్యలు, చిక్కులు ఎదురైనా, ఇలా మధ్యాహ్నం కునుకు తీసే వారు చక్కగా పరిష్కరిస్తారట.
  • మధ్యాహ్నం నిద్ర వల్ల మిగిలిన రోజంతా చురుకుగా పనిచేస్తారు. అందుకు కావాల్సిన తాజాదనాన్ని సంతరించుకుంటారు. 
  • మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర రావడం అత్యంత సహజం. ఉదయం నుంచి అప్పటి వరకు శ్రమించడం, భోజనం ద్వారా గ్లూకోజు స్థాయి పెరగడంతో శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. కనుక దీన్ని సహజ ప్రక్రియగానే చూడాలి.
  • ఇక మధ్యాహ్నం నిద్ర అన్నది 10-20 నిమిషాల వరకే ఉండాలి. ముఖ్యంగా 30 నిమిషాలకు మించి నిద్రపోకూడదు. ఎక్కువ సమయం పడుకుంటే అది బద్ధకానికి దారితీస్తుంది. దీంతో మిగిలిన రోజులో చురుగ్గా ఉండలేరు.
  • కాఫీ ద్వారా వచ్చే హుషారు కంటే కూడా మధ్యాహ్నం స్వల్ప సమయం కునుకుతో వచ్చే ప్రయోజనమే ఎక్కువని కొన్ని అధ్యయనాలు గుర్తించాయి. 
  • రాత్రి ముందుగా నిద్ర పోయే అవకాశం లేని వారు మధ్యాహ్నం తప్పకుండా 20 నిమిషాలు నిద్ర పోవడం మంచిది. 
  • ఇక మధ్యాహ్నం నిద్రతో ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు. 
  • మధ్యాహ్నం కునుకుతో వచ్చే మురో ముఖ్యమైన ప్రయోజనం రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 
  • షిఫ్ట్ ల వారీ పనిచేసే వారికి (ఒకే వేళలు కాకుండా, వేర్వేరు వేళ్లలో పనిచేసేవారు) మధ్యాహ్నం కునుకు మంచి ఫలితాలను ఇస్తుందని కూడా పరిశోధకులు తెలుసుకున్నారు. 

ఇవి గుర్తు పెట్టుకోవాలి
మధ్యాహ్నం గంట అంతకంటే ఎక్కువ సమయం నిద్రపోతే, అది రాత్రి నిద్రపై ప్రభావం చూపిస్తుంది. అంటే రాత్రి నిద్ర త్వరగా రాదు. ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత నిద్ర అంత ఉపయోగకరం కాదు. వ్యక్తుల రోజువారీ షెడ్యూల్ కూడా నిద్ర వేళలపై ప్రభావం చూపిస్తుంది. ఇక మధ్యాహ్నం ఎక్కువ సమయం నిద్ర వల్ల మగత భావన ఆవరిస్తుంది. మధ్యాహ్నం గంటకు మించి ఎక్కువ సమయం పాటు నిద్రించే వారికి టైప్-2 మధుమేహం, గుండె జబ్బులు, జీవక్రియల సమస్యలు వస్తున్నట్టు కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అందుకని మధ్యాహ్నం చిన్న కునుకు తీయడానికే పరిమితం కావడం అన్ని విధాలుగా మంచిది.
Go Back to Shorts
napping
health benefits
afternoon sleep

More Telugu News