కేసీఆర్ తో కవిత భేటీ
- ప్రగతి భవన్ కు వెళ్లిన కవిత
- సీబీఐ నోటీసుల నేపథ్యంలో తండ్రితో భేటీ
- ఇప్పటికే కవిత న్యాయ నిపుణులతో చర్చించినట్టు సమాచారం
ఈ నోటీసుల నేపథ్యంలోనే కేసీఆర్ ను కవిత కలిశారు. నోటీసులపై న్యాయపరంగా, రాజకీయపరంగా ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వీరు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ విషయంపై కవిత ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించినట్టు సమాచారం.
హైదరాబాద్ లో కానీ, ఢిల్లీలో కానీ ఎక్కడైనా విచారణకు హాజరుకావచ్చని నోటీసులో తెలిపింది. 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. ఈ స్కామ్ లో కవిత పాత్ర ఎంత ఉందనే కోణంలో సీబీఐ విచారణ జరపనుంది. ఈ కేసులో నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉన్న సంగతి తెలిసిందే.