Allu Arjun: 'పుష్ప' నుంచి రష్యన్ లాంగ్వేజ్ ట్రైలర్ రిలీజ్!

Pushpa Russian language trailer released
షార్ట్స్‌లో చూడండి
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' సినిమా సంచలన విజయాన్ని సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. కథాకథనాలు .. సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేసింది. అల్లు అర్జున్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా కొత్త రికార్డును నమోదు చేసింది. 

తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లో విడుదలైన ఈ సినిమా, వసూళ్ల పరంగా దూసుకుపోయింది. అలాంటి ఈ సినిమాను రష్యన్ భాషలోకి డబ్ చేశారు. కొంతకాలంగా అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతూ వచ్చాయి. రష్యాలో డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. రిలీజ్ కి ముందు రష్యాలోని ప్రముఖ నగరాల్లో ప్రీమియర్స్ ను ప్రదర్శించనున్నారు. 

రష్యన్ వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ ను బట్టి చూస్తే, డబ్బింగ్ విషయంలో గట్టిగానే శ్రద్ధ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయా పాత్రల మేనరిజమ్స్ రష్యన్ భాషలోను బాగానే వర్కౌట్ అయినట్టుగా అనిపిస్తోంది. ఇక రష్యాలో ఈ సినిమా ఏ స్థాయిలో జెండా ఎగరేస్తుందో చూడాలి.

Go Back to Shorts
Allu Arjun
Rashmika Mandanna
Sukumar
Pushpa Movie

More Telugu News