టీడీపీ నేత కాలువ శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్న పోలీసులు
- అనంతపురం జిల్లాలో వేడెక్కిన రాజకీయాలు
- చంద్రబాబు, లోకేశ్ లపై వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు
- కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత బత్తలపల్లి జగ్గు
- జగ్గును అరెస్ట్ చేసిన పోలీసులు
- పోలీస్ స్టేషన్ ముందు పరిటాల సునీత ఆందోళన
- సునీతకు మద్దతుగా కదిలిన కాలువ శ్రీనివాసులు
ఈ నేపథ్యంలో, ఆందోళన చేపట్టిన తమ పార్టీ శ్రేణులకు మద్దతుగా టీడీపీ సీనియర్ నేత కాలువ శ్రీనివాసులు చెన్నే కొత్తపల్లి బయల్దేరారు. అయితే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. రాయదుర్గంలో కాలువ శ్రీనివాసులును నిలువరించిన పోలీసులు ఆయనను స్థానిక టీడీపీ ఆఫీసులో గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా పోలీసులపై కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు.
పోలీసుల తీరును గర్హిస్తూ కనేకల్ రోడ్డుపై తన అనుచరులతో కలిసి బైఠాయించారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు కాలువ శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని రాయదుర్గంలోని ఆయన నివాసానికి తరలించారు.