Pawan Kalyan: ఈ నెల 27న ఇప్పటం బాధితులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం

Pawan Kalyan will distribute cheques to Ippatam villagers
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో పర్యటించిన జనసేనాని పవన్ కల్యాణ్ కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.1 లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఈ నెల 27న పవన్ కల్యాణ్ ఇప్పటం బాధితులకు ఆర్థికసాయం అందించనున్నారు. దీనిపై జనసేన పార్టీ ఓ ప్రకటన చేసింది. 

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వేదికగా నిలిచిన గ్రామం ఇప్పటం అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటం గ్రామ రైతులు జనసేన సభ ప్రాంగణం కోసం తమ పొలాలను ఇచ్చారని వెల్లడించారు. అయితే, రహదారి విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో కొన్ని ఇళ్లను కూల్చారని, ఆ సమయంలో గ్రామస్తులను కలుసుకున్న పవన్ వారి బాధల పట్ల చలించిపోయారని వివరించారు. 

కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి ఇంటికీ లక్ష రూపాయల ఆర్థికసాయాన్ని ప్రకటించారని, ఈ నేపథ్యంలో ఈ నెల 27న మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ స్వయంగా బాధితులకు చెక్కులు పంపిణీ చేస్తారని తెలిపారు.
Go Back to Shorts
Pawan Kalyan
Ippatam
Villagers
Janasena
Andhra Pradesh

More Telugu News