సానియాతో విడాకుల పుకార్లకు చెక్ పెట్టిన షోయబ్ మాలిక్!
- సానియా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు
చెబుతూ ట్వీట్ - ఈ ఇద్దరూ విడిపోతున్నారని కొన్నాళ్లుగా వార్తలు
- పాకిస్థాన్ లో టాక్ షో చేయబోతున్న దంపతులు
ఇలాంటి సమయంలో షోయబ్ మాలిక్.. సానియా మీర్జాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. సానియా మంగళవారం 36వ పడిలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా సానియాతో దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసిన మాలిక్.. ఆమెకు శుభాకాంక్షలు తెలపడంతో వీరిద్దరి విడాకుల పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. దీనికి బలం చేకూర్చేలా సానియా, షోయబ్ ఇద్దరూ కలిసి ఓ టాక్ షోను హోస్ట్ చేస్తున్నారు. పాకిస్థాన్ కు చెందిన ఓటీటీ ప్లాట్ ఫామ్ ఉర్దు ఫ్లిక్స్ లో ‘ద మీర్జా మాలిక్ షో’లో కనిపించనున్నారు.