పెన్షన్లను పెంచిన ఘనత చంద్రబాబుదే: పంచుమర్తి అనురాధ

Panchumarthi Anuradha Praises Chandrababu for Pension Hike
  • బోడె ప్రసాద్ తో కలిసి పోరంకి సుగాలి కాలనీలో వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ చేసిన అనురాధ
  • వైసీపీకి వృద్ధులపై నిజమైన పట్టింపు లేదని విమర్శ
  • కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే భారీగా పెన్షన్లు పెంచిందని వెల్లడి

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటూ పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని పోరంకి సుగాలి కాలనీలో స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌తో కలిసి ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వయంగా వృద్ధాప్య పెన్షన్లను పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా వృద్ధులతో ముచ్చటించిన అనురాధ... ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న మార్పులను వివరించారు. రాష్ట్ర బడ్జెట్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, 'సూపర్ సిక్స్' హామీలలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ను ఒకేసారి రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు.


రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 64 లక్షల మందికి పైగా వృద్ధులు, అర్హులు ఈ పెరిగిన పెన్షన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. కేవలం వృద్ధులకే కాకుండా, దివ్యాంగుల కేటగిరీల ఆధారంగా పెన్షన్లను రూ.6,000, రూ.10,000, రూ.15,000లకు పెంచి ప్రభుత్వం తమ మానవీయతను చాటుకుందని స్పష్టం చేశారు.


గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో పెన్షన్‌ను కేవలం రూ.1,000 మాత్రమే పెంచిందని, వారికి వృద్ధుల సంక్షేమంపై నిజమైన పట్టింపు లేదని పంచుమర్తి అనురాధ విమర్శించారు. అందుకు భిన్నంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భారీగా పెన్షన్లు పెంచి చూపించిందన్నారు. 

Go Back to Shorts
Panchumarthi Anuradha
Chandrababu Naidu
Andhra Pradesh Pensions
Pension Hike
Bode Prasad
Penamaluru
AP Government Schemes
Old Age Pensions
Disability Pensions
TDP Government

More Telugu News