తనకంటే మూడేళ్లు చిన్నవాడైన ప్రేమికుడితో జో బైడెన్ మనవరాలి పెళ్లి
- ఈ శనివారం వైట్ హౌస్ లో వివాహ వేడుక
- నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న నయోమీ
- వైట్ హౌస్ లో అధ్యక్షుడి మనవరాలి పెళ్లి జరగడం ఇదే తొలిసారి
వైట్ హౌస్ హిస్టారికల్ అసోసియేషన్ ప్రకారం ఈ ప్రదేశంలో అమెరికా అధ్యక్షుడి మనవరాలి వివాహం జరగనుండటం ఇదే తొలిసారి. జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ కుమార్తె అయిన 28 ఏళ్ల నయోమీ తనకంటే మూడేళ్లు చిన్నవాడైన నీల్ (25 ఏళ్లు)తో గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. నయోమీ న్యాయవాద వృత్తిలో ఉండగా.. నీల్ ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా లా స్కూల్ నుండి పట్టభద్రుడయ్యారు. వారిద్దరూ వాషింగ్టన్‌లో నివసిస్తున్నారు.