ఢిల్లీ లిక్కర్ స్కాం.. అరబిందో ఫార్మా డైరెక్టర్ తో పాటు మరొకరి అరెస్ట్!
- లిక్కర్ స్కామ్ విచారణలో దూకుడు పెంచిన ఈడీ
- శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు అరెస్ట్
- మూడు రోజుల విచారణ అనంతరం అరెస్ట్ చేసిన ఈడీ
గత మూడు రోజుల నుంచి వీరిద్దరినీ ఢిల్లీలో ఈడీ విచారించింది. విచారణ ముగిసిన వెంటనే ఇద్దరినీ అరెస్ట్ చేసింది. మరోవైపు ఈ అరెస్టులపై ఈడీ స్పందిస్తూ వీరిద్దరికీ కోట్లాది రూపాయల విలువైన మద్యం వ్యాపారాలు ఉన్నాయని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించినట్టు శరత్ చంద్రారెడ్డిపై అభియోగాలు ఉన్నాయని వెల్లడించింది. ఈడీ తాజా అరెస్టులు కలకలం రేపుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకెంత మంది అరెస్ట్ అవుతారో అనే చర్చ జరుగుతోంది.