అనూ గురించి ఎక్కువగా మాట్లాడానేమో అనుకున్నాను: అల్లు శిరీష్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనూ గురించి ఎక్కువగా మాట్లాడానేమో అనుకున్నాను: అల్లు శిరీష్

Urvasivo Rakshasivo Blackbuster Celebrations
  • 'బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్' జరుపుకున్న 'ఊర్వశివో రాక్షసివో'
  • బన్నీ ముఖ్య అతిథిగా జరిగిన సెలబ్రేషన్స్ 
  • బన్నీ తనని కొడుకులా చూసుకుంటాడని వ్యాఖ్య 
  • 'పుష్ప 2' బాక్సు బద్దలు కొడుతుందని వెల్లడి
కుటుంబ గౌరవానికి .. పెళ్లికి ప్రాధాన్యతనిచ్చే హీరో, ప్రేమ - ఆశయం అనేవాటికి మాత్రమే ప్రాముఖ్యతనిచ్చే హీరోయిన్ కి మధ్య జరిగే సంఘర్షణే 'ఊర్వశివో రాక్షసివో ' సినిమా. విభిన్నమైన కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 4వ తేదీన విడుదలై భారీ వసూళ్లను రాబడుతూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. 

"ఈ వేదికపై శిరీష్ మాట్లాడుతూ .."ఈ సినిమా టీమ్ ను సమర్థవంతంగా ముందుకు తీసుకుని వెళుతూ, విజయాన్ని తెచ్చిపెట్టిన రాకేశ్ శశికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఇక నేను అడిగినదానికంటే మా నాన్న నాకు ఎక్కువనే ఇచ్చేశాడు. అందుకు ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను. వెన్నెల కిశోర్ - సునీల్ వంటి స్టార్ కమెడియన్స్ తో కలిసి పనిచేయడం వలన నేను లక్కీ అనే అనుకుంటున్నాను" అన్నాడు.

" ఇక అనూ ఇమ్మాన్యుయేల్ విషయానికొస్తే, తనని ఇంతవరకూ ఒక స్టార్ హీరోయిన్ గా చూశారు. ఈ సినిమా తరువాత ఒక ఆర్టిస్టుగా చూస్తారని చెప్పాను. కానీ ఇంటికి వెళ్లిన తరువాత కొంచెం భయపడ్డాను .. మనమేమైనా ఎక్కువగా మాట్లాడామా? అని. కానీ రివ్యూలు చూసిన తరువాత, ఆమె నటన గురించి అంతా ప్రశంసిస్తూ రాయడంతో హ్యాపీగా అనిపించింది అని చెప్పాడు. 

'బన్నీ నన్ను ఒక తమ్ముడుగా చూడడు .. ఒక కొడుకులా చూస్తాడు. నేను కలిసినప్పుడు నా బుగ్గలు గిల్లి ముద్దు చేస్తూ ఉంటాడు. మా అన్నయ్యకి నేనంటే అంత ప్రేమ. అలాంటి అన్నయ్యకి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం. నేను సాధించడానికి ఏమీ మిగలకుండా చేశాడు.  తను చేస్తున్న 'పుష్ప 2'తో బాక్సు బద్దలైపోతుంది' అంటూ చెప్పుకొచ్చాడు.
Allu Sirish
Anu Emmanuel
Urvasivo Rakshasivo Movie

More Telugu News