బన్నీ ఆలిండియా స్టార్ .. శిరీష్ ఎదుగుతున్న స్టార్ .. ఇంతకంటే ఏంకావాలి?: అల్లు అరవింద్
- రాకేశ్ శశి దర్శకత్వంలో వచ్చిన 'ఊర్వశివో రాక్షసివో'
- శిరీష్ - అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా చేసిన సినిమా
- ఇద్దరు తనయులు గురించి ప్రస్తావించిన అల్లు అరవింద్
- తనకంటే ఆనందపడేవారు లేరని వెల్లడి
'ఆలిండియా స్టార్ గా వెళ్లిపోయిన బన్నీ .. ఇప్పుడిప్పుడే సక్సెస్ చూస్తూ స్టార్ గా ఎదుగుతున్న శిరీష్. వాళ్లిద్దరూ ఇప్పుడు ఇక్కడ నా ఎదురుగా కూర్చున్నారు. ఇక నాకంటే ఆనందపడేవారు ఎవరుంటారు? అందువలన ఈ ఆనందంలో ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడితేనే మంచిదేమోనని అనుకుంటూనే ఇక్కడికి వచ్చాను" అన్నారు.
"వెన్నెల కిశోర్ గానీ .. సునీల్ గాని థియేటర్లో ఒక ఊపు ఊపేశారు. ఎడిటింగ్ రూములో కూడా ఎన్ని సార్లు చూస్తే అన్నిసార్లు నేను ఎంజాయ్ చేశాను. ఈ కథ వినగానే 'అనూ' అయితే కరెక్టుగా ఉంటుందని భావించి, ఆమెను తీసుకుని రమ్మని చెప్పాను. నా బాధ పడలేక బన్నీయే అలా చేశాడు. రాకేశ్ శశి నేను అనుకున్నట్టుగా ఈ సినిమాను తీర్చిదిద్దగలిగాడు .. ఈ రోజున ఇంత మంచి హిట్ ఇవ్వగలిగాడు" అంటూ చెప్పుకొచ్చారు.
.