Vishnu Vishal: రవితేజ చేతుల మీదుగా 'మట్టి కుస్తీ' ఫస్టులుక్! 

  • విష్ణు విశాల్ హీరోగా రూపొందిన 'మట్టి కుస్తీ'
  • కుస్తీ ఆట నేపథ్యంలో సాగే కథ
  • కథానాయికగా ఐశ్వర్య లక్ష్మి 
  • సంగీత దర్శకత్వం వహించిన జస్టిన్ ప్రభాకరన్ 
  • త్వరలోనే థియేటర్లకు రానున్న సినిమా
Matti Kusthi First Look Released

తమిళంలో స్టార్ హీరోగా ఎదగడానికి విష్ణు విశాల్ తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తమిళ ఇండస్ట్రీలో ఆయన అడుగుపెట్టి పుష్కర కాలం అయింది. ఈ మధ్య కాలంలో ఆయన కూడా తన తమిళ సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు. అలా తమిళంలో ఆయన తాజా చిత్రమైన 'గట్ట కుస్తీ' .. తెలుగులో 'మట్టి కుస్తీ' పేరుతో విడుదల కానుంది. 

ఈ సినిమాలోని విష్ణు విశాల్ ఫస్టులుక్ ను కొంతసేపటి క్రితం రవితేజ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. కుస్తీ పోటీలో భాగంగా బరిలోకి దిగుతూ ఈ పోస్టర్ లో విష్ణు విశాల్ కనిపిస్తున్నాడు. విష్ణు విశాల్ తో రవితేజకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ సినిమాకి విష్ణు విశాల్ తో పాటు రవితేజ కూడా నిర్మాత కావడం మరో విశేషం. అందువలన రవితేజ ఈ ఫస్టులుక్ ను వదిలాడు.

ఈ సినిమాలో విష్ణు విశాల్ జోడీగా ఐశ్వర్య లక్ష్మి కనిపించనుంది. తమిళంలో ఐశ్వర్య లక్ష్మి ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్. ఇటీవల ఓటీటీలో వచ్చిన 'అమ్ము' సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్ కి మరింత చేరువైంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, చెల్ల అయ్యవు దర్శకత్వం వహించాడు. త్వరలోనే ఈ సినిమా తమిళ .. తెలుగు భాషల్లో  విడుదల కానుంది..

More Telugu News