నటసింహం ముందు మాట్లాడాలంటే మాటలు రావే!: అల్లు శిరీష్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నటసింహం ముందు మాట్లాడాలంటే మాటలు రావే!: అల్లు శిరీష్

Urvasivo Rakshasivo movie pre release event
  • అల్లు శిరీష్ నుంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ 
  • కథానాయికగా అలరించనున్న అనూ ఇమ్మాన్యుయేల్ 
  • దర్శకుడిపై శిరీష్ ప్రశంసలు 
  • వచ్చేనెల 4న రిలీజ్ అవుతున్న సినిమా  
అల్లు శిరీష్ హీరోగా నటించిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా, నవంబర్ 4వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్  హైదరాబాదులో గ్రాండ్ గా జరిగింది. బాలకృష్ణ చీఫ్ గెస్టుగా రాగా, ఈ వేదికపై అల్లు శిరీష్ మాట్లాడుతూ .. " నిజానికి ఈ స్టేజ్ పై చాలా మాట్లాడదామని ప్రిపేర్ అయ్యాను. కానీ ఎదురుగా నటసింహం కూర్చునేసరికి అంతా మరిచిపోయాను.  ఒకటి రెండు సార్లు బాలకృష్ణగారిని చాలా దగ్గరగా చూశాను .. ఆయన ఎనర్జీ లెవెల్స్ చూసి షాక్ అయ్యాను" అన్నాడు. 

"సాధారణంగా బాలకృష్ణగారు ఈవెంట్స్ కి ఎక్కువగా రారు .. అందువలన ఆయనను అడగాలా వద్దా అనే విషయమై చాలా సేపు ఆలోచన చేశాను. ఆయనంటే ఉండే ఇష్టం వలన సాహసం చేశాను. దర్శకుడు రాకేశ్ శశి విషయానికి వస్తే, తనకి కావలసిన అవుట్ పుట్ ను ఎలా రాబట్టాలనేది ఆయనకి బాగా తెలుసు. ఆయన ఎంత పని రాక్షసుడు .. ఎంత టాలెంటెడ్ అనేది ఈ సినిమా చూసిన తరువాత మీకు అర్థమవుతుంది" అని చెప్పాడు. 

"ఈ సినిమాలో సునీల్ గారు .. వెన్నెల కిశోర్ గారు .. ఆమనిగారు ముఖ్యమైన పాత్రలను పోషించారు. అలాంటి సీనియర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక అనూ గురించి చెప్పాలంటే మేడమ్ సార్ .. అంతే. నా కోసమే కాదు .. తన కోసం కూడా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.
Allu Sirish
Anu Emmanuel
Suneel
Vennnela kishore

More Telugu News