పోలీస్ స్టేషన్ ఆవరణలో నేలపై పడుకుని నిరసన తెలిపిన టీడీపీ యువ నేత
- రిషికొండ అక్రమాలపై నిరసనకు టీడీపీ పిలుపు
- విశాఖకు చెందిన టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
- నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు అప్పలనాయుడు తరలింపు
- స్టేషన్ ఆవరణలో వినూత్న నిరసనకు దిగిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి
టీడీపీ నేతల అరెస్టుల్లో భాగంగా అప్పలనాయుడును అదుపులోకి తీసుకున్న పోలీసులు... ఆయనను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో ఆయనను కూర్చోబెట్టిన పోలీసులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల అరెస్ట్ లకు నిరసనగా అప్పలనాయుడు వినూత్నంగా నిరసన చేపట్టారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో నేలపై పడుకుని ఆయన నిరసన తెలిపారు. ఈ వినూత్న నిరసనను తన మొబైల్ లో రికార్డ్ చేసిన అప్పలనాయుడు... ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.