Arjun Kalyan: సత్య కోసం నేను బిగ్ బాస్ కి వెళ్లలేదు: అర్జున్ కల్యాణ్

Arjun Kalyan Interview
షార్ట్స్‌లో చూడండి
బిగ్ బాస్ సీజన్ 6లో నిన్నమొన్నటి వరకూ బాగా పాప్యులర్ అయింది అర్జున్ కల్యాణ్ .. సత్య మధ్య ఉన్న ఫ్రెండ్షిప్. గేమ్ లో ఒకరిని ఒకరు గెలిపించుకోవడం కోసం వాళ్లిద్దరూ తీసుకున్న నిర్ణయాల గురించి అంతా మాట్లాడుకున్నారు. క్రితం వారం 'అర్జున్ కల్యాణ్' ఎలిమినేట్ అయినప్పుడు సత్య కన్నీళ్లు పెట్టుకోవడం వాళ్లిద్దరి ఫ్రెండ్షిప్ ఏ స్థాయిలో ఉందనేది చెప్పింది. ఆ సమయంలో అర్జున్ కల్యాణ్ ఎమోషనల్ కావడం కూడా హాట్ టాపిక్ గా మారింది. 

తాజా ఇంటర్వ్యూలో అర్జున్ కల్యాణ్ మాట్లాడుతూ .. "నాకు యాక్టింగ్ అంటే ఇష్టం .. సినిమాల్లో పేరు తెచ్చుకోవాలనేది నా ఆశ. అలాంటి సమయంలోనే నేను బిగ్ బాస్ కోసం ట్రై చేస్తున్నట్టుగా సత్య నాకు చెప్పింది. 'బిగ్ బాస్'లో కనిపించడం వలన ఎక్కువ రీచ్ ఉంటుందని భావించి, నేను కూడా ట్రై చేశాను. సత్య వలన నేను నేను బిగ్ బాస్ కి వచ్చినట్టుగా స్టేజ్ పై చెప్పాను .. కానీ సత్య కోసం వచ్చినట్టుగా చాలామంది అర్థం చేసుకున్నారు" అని అన్నాడు. 

'బిగ్ బాస్' లోకి అడుగుపెట్టిన తరువాత అక్కడి పరిస్థితి అర్థం కావడానికి నాకు కొంత ఎక్కువ సమయమే పట్టింది. 4వ వారంలో నామినేట్ అయినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. ఆ తరువాత మాత్రం ఏమీ అనిపించలేదు. నా ఆట తీరును మెరుగుపరుచుకుంటూ వెళ్లాను. నేను బాగానే ఆడుతున్నాను .. ఇక హౌస్ లో కుదురుకుంటానని అనిపించిన సమయంలోనే బయటికి రావలసి వచ్చింది. ఇది నేను ఎంతమాత్రం అనుకోలేదు" అంటూ చెప్పుకొచ్చాడు..
Go Back to Shorts
Arjun Kalyan
Sathya
Bigg Boss

More Telugu News