Telangana: 50 రోజుల్లో 5 రాష్ట్రాలు... గురువారం 26 కిలోమీటర్లు నడిచిన రాహుల్

rahul gandhi coplets 50 days of bharat jodo yatra on thurs day
షార్ట్స్‌లో చూడండి
భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ...గురువారం నాటికి 50వ రోజు యాత్రను తెలంగాణలో కొనసాగించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ నుంచి గురువారం ఉదయం మొదలైన ఈ యాత్రలో తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు. యాత్ర ప్రారంభమై గురువారం నాటికి 50 రోజులు కాగా... 50వ రోజు తెలంగాణలో రాహుల్ గాంధీ 26 కిలోమీటర్ల మేర నడిచారు.

ఇదిలా ఉంటే... తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్ర 50 రోజుల్లోనే 5వ రాష్ట్రంలో అడుగుపెట్టింది. తమిళనాడు నుంచి మొదలైన యాత్ర కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లను దాటేసి తెలంగాణలోకి అడుగుపెట్టింది. మరోవైపు తెలంగాణలో రాహుల్ యాత్రకు ఊహించిన దాని కంటే అధిక స్పందన లభిస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాహుల్ యాత్రకు మక్తల్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మత్స్యకారులు వినూత్నంగా స్వాగతం పలికారు. నీటిలో దిగిన మత్స్యకారులు.. వీ ఆర్ ఆల్వేస్ విత్ యూ అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకుని రాహుల్ కు స్వాగతం పలికారు.
Go Back to Shorts
Telangana
Bharat Jodo Yatra
Rahul Gandhi

More Telugu News