RRR: జనవరి 24న ఆస్కార్ నామినేషన్ల ప్రకటన... 'ఆర్ఆర్ఆర్' లక్ష్యం నెరవేరేనా...?

  • భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్ కు వెళ్లే చాన్స్ మిస్
  • సొంతంగా ప్రయత్నాలు చేసుకుంటున్న ఆర్ఆర్ఆర్ టీమ్
  • నామినేషన్ల అంశంపై ట్వీట్ చేసిన అమెరికా జర్నలిస్ట్
Oscar Nominations will be out in January

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో రూపుదిద్దుకున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘనవిజయం సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అనేక ఫిలిం పెస్టివల్స్ లోనూ ప్రదర్శితమైంది.

అయితే భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్ కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయిన ఆర్ఆర్ఆర్... ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల రేసులో నిలిచేందుకు సొంతంగానే ప్రయత్నాలు చేస్తోంది. 'ఫర్ యువర్ కాన్సిడరేషన్' (ఎఫ్ వైసీ) క్యాంపెయిన్ సాయంతో ఈ చిత్రాన్ని ఆస్కార్ కు చేరువ చేయాలని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం తీవ్రంగా కృషి చేస్తోంది. మొత్తం 14 విభాగాల్లో పోటీ పడాలన్నది వారి లక్ష్యంగా కనిపిస్తోంది.

కాగా, ఆస్కార్ అవార్డుల నామినేషన్లను 2023 జనవరి 24న ప్రకటించనున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ పాత్రికేయురాలు రోచెల్లీ రిలే ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించారు. ఆస్కార్ అవార్డులు ఇచ్చే అకాడమీ సభ్యులు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూస్తారని భావిస్తున్నానని ఆమె వెల్లడించారు. తారక్ కనబర్చిన అసాధారణ నటనను వారు గుర్తిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. తాను మరోసారి ఈ చిత్రాన్ని చూస్తానని పేర్కొన్నారు.

More Telugu News