తమిళనాట మరో రికార్డును సెట్ చేసిన 'పొన్నియిన్ సెల్వన్'
Add ap7am to your home Screen

తమిళనాట మరో రికార్డును సెట్ చేసిన 'పొన్నియిన్ సెల్వన్'

Ponniyin Selven Update
  • మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన 'పొన్నియిన్ సెల్వన్'
  • క్రితం నెల 30వ తేదీన విడుదలైన సినిమా 
  • ఒక్క తమిళనాడులోనే 200 కోట్ల వసూళ్లు 
  • అసలు కథంతా సెకండు పార్టులోనే 
  • ఆ సినిమా వసూళ్లపై అప్పుడే అంచనాలు
మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన 'పొన్నియిన్ సెల్వన్' క్రితం నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ తారాగణం .. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, తొలి రోజునే రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. తెలుగులో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోయినా, తమిళనాడులో మాత్రం వసూళ్ల పరంగా అదే ఊపు కొనసాగుతోంది. 

తాజా వసూళ్లతో ఈ సినిమా కేవలం తమిళనాడులో మాత్రమే 200 కోట్లకి  పైగా వసూళ్లను రాబట్టింది. ఒక్క తమిళనాడులోనే 200 కోట్లను వసూలు చేసిన తొలి కోలీవుడ్ మూవీ ఇదేనని అంటున్నారు. అలాంటి ఒక అరుదైన రికార్డును ఈ సినిమా సొంతం చేసుకుందని చెబుతున్నారు. మొత్తానికి మణిరత్నం ఎప్పటిలా నవ్వుతూనే సైలెంట్ గా వసూళ్ల సునామీని సృష్టించాడనే అభిప్రాయాలు  వినిపిస్తున్నాయి.

నిజానికి ఇది చాలా విస్తారమైన కథ. అందువల్లనే రెండు భాగాలుగా తీస్తున్నారు. ఫస్టు పార్టులో చాలా కథ నడచిన తరువాతగాని, అసలు ఏం జరుగుతుందనేది అర్థం కాదు. పైగా కొన్ని ఫ్లాష్ బ్యాక్ లు సెకండ్ పార్టులో రివీల్ కానున్నాయి. అసలు కథ అంతా కూడా సెకండు పార్టులోనే ఉంటుంది. అందువలన సెకండు పార్టు ఇంతకు మించిన వసూళ్లను సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Vikram
Karthi
Aishwarya Rai
Ponniyin Selvan Movie

More Telugu News