నరేంద్రను ముందు ఆసుపత్రికి తరలించండి... వైద్యుల నివేదిక వచ్చాకే రిమాండ్ పై నిర్ణయం తీసుకుంటామన్న జడ్జి
- నరేంద్రను జడ్జి ముందు హాజరుపరచిన సీఐడీ అధికారులు
- సీఐడీ అధికారులు తనను కొట్టారంటూ జడ్జికి ఫిర్యాదు చేసిన నరేంద్ర
- నరేంద్ర ఆరోగ్యంపై నివేదిక అందించాలన్న కోర్టు
- జీజీహెచ్ వైద్యులకు ఆదేశాలు
బుధవారం నరేంద్రను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి నరేంద్రను తమ కస్టడీలోనే ఉంచుకున్న సీఐడీ అధికారులు గురువారం రాత్రి సీఐడీ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీఐడీ అధికారులు విచారణ పేరిట తనను తీవ్రంగా కొట్టారని నరేంద్ర జడ్జికి తెలిపారు. నరేంద్ర వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న న్యాయమూర్తి... నరేంద్రను ముందుగా ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు.