ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభిషేక్‌రావుకు సీబీఐ కస్టడీ పొడిగింపు
- గురువారంతో ముగిసిన అభిషేక్ రావు సీబీఐ కస్టడీ
- మరో 2 రోజుల పాటు కస్టడీ పొడిగించాలన్న సీబీఐ
- సీబీఐ వాదనకు ఒకే చెప్పిన కోర్టు
కోర్టు నిర్దేశించిన గడువు గురువారం పూర్తి కావడంతో అభిషేక్‌ను సీబీఐ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అభిషేక్‌ను మరో 2 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని కోర్టును సీబీఐ కోరింది. ఈ మేరకు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు... అభిషేక్ రావును మరో 2 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది.